IFFCO Nano DAP is now available for purchase. Click here to know more

మేము సస్టైనబిలిటీని నమ్ముతాం

మేము సస్టైనబిలిటీని నమ్ముతాం

డ్రైవింగ్ సస్టైనబిలిటీ

ఇఫ్కో నానో యూరియా గురించి తెలుసుకోండి

వాతావరణ మార్పులతో పోరాడటానికి రైతులకు సహాయకారి వాతావరణ మార్పులతో పోరాడాలనుకునే రైతులకు ఇది సహాయకారి

నానో యూరియా, 4 R న్యూట్రియంట్ స్టీవార్డ్‌షిప్ లోని సంభావ్య భాగం. ఎందుకంటే ఇది ఖచ్చితమైన మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది పారిశ్రామిక ఉత్పత్తి శక్తితో కూడుకున్నది కాదు లేదా అనవసర వనరుల వినియోగదారు కాదు. దీనికి అదనంగా, పర్యావరణ కాలుష్యం మరియు వాతావరణ మార్పులకు కారణమయ్యే వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే లీచింగ్ మరియు వాయు ఉద్గారాల రూపంలో పోషకాల నష్టాన్ని తగ్గించడం ద్వారా నానో యూరియా పర్యావరణ పరిరక్షణ పాత్రను పోషించటంలో ముందు ఉంటుంది.

ఇఫ్కో నానో యూరియా వలన చేకూరే ప్రయోజనాలు

వ్యవసాయాన్ని సులభతరం చేయడం మరియు నిలకడ కలిగినదిగా చేయడం
  • అధిక పంటల దిగుబడి కోసం
  • రైతుల ఆదాయం పెంచుతుంది. ​
  • నాణ్యమైన ఆహారం సాధ్యం చేస్తుంది. ​
  • రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది.
  • పర్యావరణ పరి రక్షణ చేస్తుంది.
  • నిల్వ మరియు రవాణా చేయటం సులభం
ఇఫ్కో నానో యూరియాలో ఉన్న సైన్స్

నానో యూరియా (లిక్విడ్) 4 % నానోస్కేల్ నైట్రోజన్ కణాలను కలిగి ఉంటుంది. నానోస్కేల్ నైట్రోజన్ కణాలు చిన్న పరిమాణాన్ని కలిగి ఉంటాయి (20-50 nm); సాంప్రదాయ యూరియా కంటే ఎక్కువ ఉపరితల వైశాల్యం మరియు యూనిట్ ప్రాంతానికి కణాల సంఖ్య.

సర్టిఫికేషన్లు-
ఇఫ్కో నానో యూరియా జాతీయ మరియు అంతర్జాతీయంగా ఆమోదించబడిన ఉత్పత్తులలో ఒకటి.

ఇఫ్కో నానో యూరియా, OECD పరీక్ష మార్గదర్శకాలు (TGs) మరియు నానో అగ్రి-ఇన్‌పుట్‌లు (NAIPs) మరియు ఆహార ఉత్పత్తులను పరీక్షించడానికి భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నిర్ధేశించిన మార్గదర్శకాలతో సమకాలీకరించబడింది.ఇది మాత్రమే కూండా స్వతంత్రంగా, నానో యూరియా బయో-ఎఫిషియసీ, బయో సేఫ్టీ-టాక్సిసిటీ మరియు ఎన్‌ఏబీఎల్-గుర్తింపు పొందిన మరియు GLP సర్టిఫైడ్ లాబొరేటరీల ద్వారా దీని పర్యావరణ అనుకూలతను పరీక్షించుకుని, ధృవీకరించబడింది. ఇఫ్కో నానో ఎరువులు నానోటెక్నాలజీ లేదా నానో స్కేల్ అగ్రి-ఇన్‌పుట్‌లకు సంబంధించిన అన్ని జాతీయ మరియు అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయి. నానోటెక్నాలజీ అందించే వరాల అన్ని ప్రయోజనాలను రైతులకి అందించాలనే ఆలోచనతో FCO 1985 షెడ్యూల్ VIIలో నానో యూరియా వంటి నానో-ఎరువులను చేర్చడంతో, దీని ఉత్పత్తిని ఇఫ్కో చేపట్టింది. నానో ఎరువుల వల్ల 'ఆత్మనిర్భర్ భారత్' మరియు 'ఆత్మనిర్భర్ కృషి' పరంగా ఇఫ్కో నానో యూరియా స్వావలంబన దిశలో ఒక ముందు అడుగు అవుతుంది.

ఇంకా చదవండి +

స్థిరత్వంవైపుకు

స్థిరత్వంవైపుకు... నానో యూరియా,4 R న్యూట్రియంట్ స్టీవార్డ్‌షిప్ యొక్క సంభావ్య భాగం. ఇది ఖచ్చితత్వం మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ఇది పారిశ్రామిక ఉత్పత్తి శక్తితో కూడుకున్నది లేదా వనరులను వినియోగించుకున్నది కాదు. నానో యూరియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT), ప్రభుత్వం ద్వారా ధృవీకరించింది.భారతదేశ మార్గదర్శకాల ద్వారా నానో అగ్రి-ఇన్‌పుట్ ఉత్పత్తుల (NAIPs) మూల్యాంకనం ప్రకారం ఆమోదించబడ్డాయి. ఆమోదించబడిన ఈ మార్గదర్శకాలు అంతర్జాతీయ నిబంధనలు & OECD ప్రోటోకాల్‌ల ప్రకారం ఉన్నాయి. NABL గుర్తింపు పొందిన మరియు GLP సర్టిఫైడ్ లేబొరేటరీలు నిర్వహించిన పరీక్షల ప్రకారం నానో యూరియా వినియోగదారుకు మరియు పర్యావరణానికి సురక్షితమైనదిగా ప్రకటించబడింది. నానో యూరియా, కాబట్టి, యూరియా వంటి సాంప్రదాయిక భారీ నత్రజని ఎరువులకు ఆశాజనకమైన, స్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైన పరిష్కారంగా నిలుస్తున్నది.

మీ దగ్గర నిజమైన నానో యూరియా బాటిల్ ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నారా. ఇలా తెలుసుకోవచ్చు.

  1. సీసాలపై ఉన్న లేబుల్స్ తీసేయటం కుదరదు. ఎందుకంటె వాటిపై మౌల్డ్ లేబుల్స్ వేసి ఉన్నాయి.
  2. సీసా సరిగా ఇఫ్కో లోగోతో మూసివేయబడి ఉందో లేదో తనిఖీ చేయండి. మరియు టెంపర్ జరిగిందేమో చుడండి.
  3. ఉత్పత్తి మరియు అమ్మకం వివరాలను తెలుసుకోవడానికి నానో యూరియా బాటిల్‌పై ఉన్న ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. ఎందుకంటే ఒకే క్యూఆర్ కోడ్ బాటిల్ రెండుసార్లు అమ్ముడుపోదు.