IFFCO Nano DAP is now available for purchase. Click here to know more

ఇఫ్కో నానో యూరియా

ఇఫ్కో నానో యూరియా, ఒక నానోటెక్నాలజీ ఆధారిత విప్లవాత్మక వ్యవసాయ-ఇన్‌పుట్, ఇది మొక్కలకు నత్రజనిని అందిస్తుంది.నానో యూరియా, స్మార్ట్ వ్యవసాయంకి సహాయపడే ఉత్పత్తి. అంతే కాదు వాతావరణ మార్పులను చక్కగా ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడే నమ్మకమైన ఉత్పత్తి . అందుకే ఇది రైతుల నమ్మకమైన ఎంపికగా నిలిచింది. ఇది ఎరువుగా మొక్కల పోషక అవసరాలను తీరుస్తుంది. ఎందుకంటే నానో యూరియా 20-50 nm అంతకంటే ఎక్కువ ఉపరితల వైశాల్యం కలిగి మొక్కకు కావాల్సిన కణ పరిమాణం కలిగి ఉన్నకారణంగా మొక్కలకు బయో అందుబాటులో ఉంటుంది. (1 మిమీ యూరియా ప్రిల్ కంటే 10,000 రెట్లు) మరియు కణాల సంఖ్య (1 మిమీ యూరియా ప్రిల్ కంటే 55,000 నైట్రోజన్ కణాలు). దీనివలన నానో యూరియా చేతికి వచ్చే పంటను లభ్యతను 80% కంటే ఎక్కువ పెంచుతుంది. ఫలితంగా అధిక పోషక వినియోగ సామర్థ్యం సాధ్యం చేస్తుంది. దీనికి అదనంగా, పర్యావరణ కాలుష్యం మరియు వాతావరణ మార్పులకు కారణమయ్యే లీచింగ్ మరియు వాయు ఉద్గారాల రూపంలో వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే పోషకాల నష్టాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో తన పాత్రను పోషించటంలో నానో యూరియా విశేషంగా విజయం సాధించింది. ఇంకా చదవండి +

డ్రైవింగ్ సస్టైనబిలిటీ

ఇఫ్కో నానో యూరియా గురించి తెలుసుకోండి

వాతావరణ మార్పులతో పోరాడటానికి రైతులకు సహాయకారి వాతావరణ మార్పులతో పోరాడాలనుకునే రైతులకు ఇది సహాయకారి

నానో యూరియా, 4 R న్యూట్రియంట్ స్టీవార్డ్‌షిప్ లోని సంభావ్య భాగం. ఎందుకంటే ఇది ఖచ్చితమైన మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది పారిశ్రామిక ఉత్పత్తి శక్తితో కూడుకున్నది కాదు లేదా అనవసర వనరుల వినియోగదారు కాదు. దీనికి అదనంగా, పర్యావరణ కాలుష్యం మరియు వాతావరణ మార్పులకు కారణమయ్యే వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే లీచింగ్ మరియు వాయు ఉద్గారాల రూపంలో పోషకాల నష్టాన్ని తగ్గించడం ద్వారా నానో యూరియా పర్యావరణ పరిరక్షణ పాత్రను పోషించటంలో ముందు ఉంటుంది.

ఇఫ్కో నానో యూరియా వలన చేకూరే ప్రయోజనాలు

వ్యవసాయాన్ని సులభతరం చేయడం మరియు నిలకడ కలిగినదిగా చేయడం
  • అధిక పంటల దిగుబడి కోసం
  • రైతుల ఆదాయం పెంచుతుంది. ​
  • నాణ్యమైన ఆహారం సాధ్యం చేస్తుంది. ​
  • రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది.
  • పర్యావరణ పరి రక్షణ చేస్తుంది.
  • నిల్వ మరియు రవాణా చేయటం సులభం
ఇఫ్కో నానో యూరియాలో ఉన్న సైన్స్

నానో యూరియా (లిక్విడ్) 4 % నానోస్కేల్ నైట్రోజన్ కణాలను కలిగి ఉంటుంది. నానోస్కేల్ నైట్రోజన్ కణాలు చిన్న పరిమాణాన్ని కలిగి ఉంటాయి (20-50 nm); సాంప్రదాయ యూరియా కంటే ఎక్కువ ఉపరితల వైశాల్యం మరియు యూనిట్ ప్రాంతానికి కణాల సంఖ్య.

సర్టిఫికేషన్లు-
ఇఫ్కో నానో యూరియా జాతీయ మరియు అంతర్జాతీయంగా ఆమోదించబడిన ఉత్పత్తులలో ఒకటి.

ఇఫ్కో నానో యూరియా, OECD పరీక్ష మార్గదర్శకాలు (TGs) మరియు నానో అగ్రి-ఇన్‌పుట్‌లు (NAIPs) మరియు ఆహార ఉత్పత్తులను పరీక్షించడానికి భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నిర్ధేశించిన మార్గదర్శకాలతో సమకాలీకరించబడింది.ఇది మాత్రమే కూండా స్వతంత్రంగా, నానో యూరియా బయో-ఎఫిషియసీ, బయో సేఫ్టీ-టాక్సిసిటీ మరియు ఎన్‌ఏబీఎల్-గుర్తింపు పొందిన మరియు GLP సర్టిఫైడ్ లాబొరేటరీల ద్వారా దీని పర్యావరణ అనుకూలతను పరీక్షించుకుని, ధృవీకరించబడింది. ఇఫ్కో నానో ఎరువులు నానోటెక్నాలజీ లేదా నానో స్కేల్ అగ్రి-ఇన్‌పుట్‌లకు సంబంధించిన అన్ని జాతీయ మరియు అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయి. నానోటెక్నాలజీ అందించే వరాల అన్ని ప్రయోజనాలను రైతులకి అందించాలనే ఆలోచనతో FCO 1985 షెడ్యూల్ VIIలో నానో యూరియా వంటి నానో-ఎరువులను చేర్చడంతో, దీని ఉత్పత్తిని ఇఫ్కో చేపట్టింది. నానో ఎరువుల వల్ల 'ఆత్మనిర్భర్ భారత్' మరియు 'ఆత్మనిర్భర్ కృషి' పరంగా ఇఫ్కో నానో యూరియా స్వావలంబన దిశలో ఒక ముందు అడుగు అవుతుంది.

ఇంకా చదవండి +