IFFCO Nano DAP is now available for purchase. Click here to know more

రైతుల అంగడి

ఇఫ్కో నానో యూరియా గురించి వివరాలు.

ఇఫ్కో నానో యూరియా (ద్రవం) ప్రపంచంలోని మొట్టమొదటి నానో ఫర్టిలైజర్. దీనిని భారత ప్రభుత్వ ఎరువుల నియంత్రణ ఆర్డర్ (FCO, 1985) కింద గుర్తించింది. నానో యూరియాలో మొత్తం 4.0% నైట్రోజన్ (w/v) ఉంటుంది. నానో నైట్రోజన్ కణ పరిమాణం 20-50 nm వరకు ఉంటుంది. ఈ కణాలు నీటిలో సమానంగా కరిగిపోతాయి.నానో యూరియా చిన్న పరిమాణం (20-50nm) మరియు అధిక వినియోగ సామర్థ్యం (> 80 %) కారణంగా మొక్కకు అందాల్సిన నత్రజని లభ్యతను మెరుగుపరుస్తుంది. మొక్క యొక్క క్లిష్టమైన ఎదుగుదల దశలలో ఆకులపై పిచికారీ చేసినప్పుడు, అది స్టోమాటా మరియు ఇతర ఓపెనింగ్స్ ద్వారా ప్రవేశించి, మొక్క కణాల ద్వారా గ్రహించబడుతుంది. ఫ్లోయమ్ రవాణా కారణంగా ఇది మూలం నుండి మొక్క లోపల చివరి కణం వరకు ఎక్కడ అవసరం అయినా అక్కడికి సరఫరా చేయబడుతుంది. ఉపయోగించని నత్రజని మొక్క వాక్యూల్‌లో నిల్వ చేయబడుతుంది మరియు మొక్క యొక్క సరైన ఎదుగుదల మరియు అభివృద్ధి మేరకు నెమ్మదిగా విడుదల అవుతుంటుంది.

సమయం మరియు వాడే విధానం

ఒక లీటరు నీటిలో 2-4 మి.లీ నానో యూరియా (4 % N) మిక్స్ చేసి, అది క్రియాశీల వృద్ధి దశలో ఉండగా పంట ఆకులపై పిచికారీ చేయాలి.

ఉత్తమ ఫలితాల కోసం 2 ఫోలియార్ పిచికారీ చేయండి* -

  • మొదటి స్ప్రే: బాగా చిగురించే /కొమ్మల దశలో (అంకురోత్పత్తి తర్వాత 30-35 రోజులు లేదా మార్పిడి తర్వాత 20-25 రోజులు)
  • 2వ పిచికారీ: మొదటి స్ప్రే తర్వాత లేదా పంట పుష్పించే దశ 20-25 రోజుల తర్వాత చేయండి.

గమనిక - డిఏపి లేదా సంక్లిష్ట ఎరువుల ద్వారా సరఫరా చేయబడిన బేసల్ నత్రజనిని మానేయవద్దు. 2-3 స్ప్లిట్ లలో టాప్-డ్రెస్డ్ యూరియాను మాత్రమే మానేయండి. పంట మరియు దానికి పట్టే వ్యవధి బట్టి మొత్తం నత్రజని అవసరాన్ని నానో యూరియా పిచికారీల సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.

పంటల వారీ వాడే విధానంకి సంబందించిన సమాచారం కోసం, దయచేసి మా టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 18001031967కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి.

భద్రతా జాగ్రత్తలు మరియు సాధారణ సూచనలు

నానో యూరియా నాన్ టాక్సిక్. వినియోగదారుకు సురక్షితం. వృక్షజాలం మరియు జంతుజాలానికి సురక్షితం. అయితే పంటపై పిచికారీ చేసేటప్పుడు ఫేస్ మాస్క్ మరియు గ్లోవ్స్ వాడాలని సిఫార్సు చేయబడింది.

అధిక ఉష్ణోగ్రతలో పెట్టొద్దు. పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.

పిల్లల నుంచి మరియు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉంచండి.

క్రింద సాధారణ సూచనలు చుడండి

  • ఉపయోగించే ముందు బాటిల్‌ను బాగా షేక్ చేసి కలపండి
  • ఆకుల మీద ఏకరీతి పిచికారీ కోసం ఫ్లాట్ ఫ్యాన్ లేదా కట్ నాజిల్ ను ఉపయోగించండి.
  • మంచు పడకుండా చూసుకుని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి.
  • నానో యూరియా పిచికారీ చేసిన 12 గంటలలోపు వర్షం పడితే, మళ్ళీ పిచికారీని పునరావృతం చేయాలి.
  • నానో యూరియాను బయో స్టిమ్యులేంట్స్‌తో సులభంగా కలపవచ్చు. 100 % నీటిలో కరిగే ఎరువులు మరియు అనుకూల వ్యవసాయ రసాయనాలలో కలప వచ్చు. అనుకూలతను తనిఖీ చేయడానికి మిక్సింగ్ మరియు స్ప్రే చేయడానికి ముందు జార్ పరీక్ష చేయాలనీ ఎల్లప్పుడూ సూచించటం అయినది.
  • మెరుగైన ఫలితల కోసం నానో యూరియాని దాని తయారీ తేదీ నుంచి 1 సంవత్సరాలలోపు వాడాలి.

ధర మరియు ఇతర ప్రత్యేకతలు

బ్రాండ్: ఇఫ్కో
ఉత్పత్తి వాల్యూమ్ (ఒక్కో సీసాకి):  500 మి.లీ
పోషక కంటెంట్ (ఒక్కో సీసాకి): 4% డబ్ల్యూ/వి
షిప్పింగ్ బరువు (ఒక్కో బాటిల్): 560 గ్రా
ధర (ఒక్కో సీసా): రూ. 225
తయారీదారు: ఇఫ్కో
ఉత్పత్తి చేసిన దేశం: భారతదేశం
విక్రేత: ఇఫ్కో

మీ ప్రశ్నలు అడగండి